ఐపీఎల్ - 2018 వేలంఐపీఎల్ సీజన్ 11కు సంబంధించిన 2018 వేలం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో జరిగింది. ఈ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గతేడాదిలాగే ఈ ఏడాదీ ఫ్రాంచైజీలన్నీ వేలంలో అతనిపైనే గాలం వేశాయి. మొత్తానికి రూ.12.50 కోట్లతో రాజస్తాన్ రాయల్స్ వశమయ్యాడు స్టోక్స్. గతేడాది (రూ. 14.50 కోట్లు; పుణే)తో పోలిస్తే 2 కోట్లు తక్కువైనా... అప్పుడు ఇప్పుడు వేలంలో అగ్రస్థానం అతనికే లభించింది. ఇదే జట్టు లెఫ్టార్మ్ పేస్ బౌలర్ జైదేవ్ ఉనాద్కత్‌ను రూ.11.5 కోట్లకు సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మనీశ్ పాండేను రూ.11 కోట్లకు దక్కించుకుంది.
2018 వేలంలో..
అమ్ముడుపోయిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య - 169
మొత్తం భారత ఆటగాళ్లు - 113
అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లు - 56
మొత్తం విదేశీ ఆటగాళ్లు - 71
ఫ్రాంచైజీలు వెచ్చించిన మొత్తం - రూ. 431 కోట్ల 70 లక్షలు
ఆస్ట్రేలియా ఓపెన్ విజేత రోజర్ ఫెడరర్
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలుపొందడం ద్వారా 36 ఏళ్ల రోజర్ తన కెరీర్‌లో 20వ టైటిల్‌ను గెలుచుకున్నాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 40 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 63 లక్షలు)... రన్నరప్ మారిన్ సిలిచ్‌కు 20 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 31 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
200వ గ్రాండ్‌స్లామ్... 30వ ఫైనల్...
టెన్నిస్ చరిత్రలో ఇది 200వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ఇందులో 30వ ఫైనల్ ఆడిన ఫెడరర్ 20వ టైటిల్ గెలవడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతనికిది ఆరో టైటిల్. దీంతో ఇది వరకే ఈ ఘనత సాధించిన జొకోవిచ్ (సెర్బియా), అలనాటి ఆసీస్ దిగ్గజం రాయ్ ఎమర్సన్‌ల సరసన నిలిచాడు.
ఇండోనేషియా ఓపెన్ విజేత తై జు యింగ్
ఇండోనేషియా మాస్టర్స్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ తై జు యింగ్(చైనీస్ తైపీ) గెలుచుకుంది. జనవరి 28న జరిగిన ఫైనల్లో తై జుయి యింగ్.. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. మొత్తంగా సైనాపై తై జు యింగ్‌కిది వరుసగా ఏడో విజయం. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 69 వేలు)... రన్నరప్ సైనాకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత కరోలిన్ వోజ్నియాకి
ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను డెన్మార్ స్టార్ కరోలిన్ వోజ్నియాకి సొంతం చేసుకుంది. జనవరి 27న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలుపొంది టైటిల్ విజేతగా నిలిచింది. తద్వారా 11 ఏళ్ల తర్వాత మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో పాటు డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది.
టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా
భారత్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. జొహన్నెస్‌బర్గ్‌లో జనవరి 27న ముగిసిన మూడో టెస్టును భారత్ గెలుచుకోవడంతో సిరీస్ 2-1 తేడాతో దక్షిణాఫ్రికా వశమైంది.
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక అవార్డుల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యాడు. దిగ్గజ ఆల్‌రౌండర్ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ అవార్డును తొలిసారి కోహ్లి అందుకోనున్నాడు. భారత్ తరఫున గతంలో ద్రవిడ్, సచిన్, అశ్విన్ దీనిని గెల్చుకున్నారు. ఇక 50 ఓవర్ల ఫార్మాట్‌లో తిరుగులేని ప్రదర్శన కనబర్చి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన కోహ్లి ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఐసీసీ టెస్టు, వన్డే జట్లలో స్థానం లభించడంతో పాటు ఆ రెండు టీమ్‌లకు కూడా అతనే కెప్టెన్‌గా ఎంపిక కావడం కోహ్లికి లభించిన మరో అరుదైన గౌరవం.
మరో ప్రధాన అవార్డు ఐసీసీ ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు లభించింది. ఇంగ్లండ్‌పై భారత యువ లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చహల్ బౌలింగ్ (6/25) 2017 టి20 అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు హసన్ అలీ (పాకిస్తాన్)కు దక్కగా... అఫ్ఘానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు.
ఐసీసీ టెస్టు ఎలెవన్, వన్డే ఎలెవన్ జట్లను కూడా ప్రకటించింది. టెస్టు జట్టులో భారత్ తరఫున చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు లభించింది. మూడో డబుల్ సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ, పేస్ అస్త్రం జస్‌ప్రీత్ బుమ్రా వన్డే టీమ్‌లోకి ఎంపికయ్యారు. వార్నర్, స్టోక్స్, డి కాక్ రెండు జట్లలోనూ ఉన్నారు.
ఐసీసీ టెస్టు ఎలెవన్: కోహ్లి (కెప్టెన్), ఎల్గర్, వార్నర్, స్మిత్, పుజారా, స్టోక్స్, డి కాక్, అశ్విన్, స్టార్క్, రబడ, అండర్సన్.
ఐసీసీ వన్డే ఎలెవన్: కోహ్లి (కెప్టెన్), వార్నర్, రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, డివిలియర్స్, డి కాక్, స్టోక్స్, బౌల్ట్, హసన్ అలీ, రషీద్ ఖాన్, బుమ్రా.
అవార్డు విజేతలు
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్)
ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: హసన్ అలీ(పాకిస్తాన్)
ఫ్యాన్స్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్: పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకోవడం.
ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్: మరాయిస్ ఎరాస్‌మస్ (దక్షిణాఫ్రికా)
900 రేటింగ్ పాయింట్ల మార్క్‌ని అందుకున్న కోహ్లీ జనవరి 18న ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్‌సలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి 900 రేటింగ్ పాయింట్లు సాధించాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ (916 పాయింట్లు-1979లో) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. తాజా పాయింట్లతో అతను వరల్డ్ ర్యాంకింగ్‌సలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం 947 పాయింట్లతో స్మిత్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.
గతంలో భారత ఆటగాళ్లు సచిన్ (898), ద్రవిడ్ (892) 900 పాయింట్ల మార్క్‌కు చేరువగా వచ్చినా దానిని అందుకోలేకపోయారు. ఓవరాల్‌గా 900 రేటింగ్ పాయింట్ల మైలురాయిని అందుకున్న 31వ బ్యాట్స్‌మన్ కోహ్లి. డాన్ బ్రాడ్‌మన్ 961 పాయింట్లతో ఆల్‌టైమ్ టాప్‌గా నిలిచాడు.
అంధుల వన్డే ప్రపంచ కప్ విజేత భారత్అంధుల క్రికెట్ వన్డే ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. జనవరి 20న షార్జాలో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి కప్‌ను గెలుచుకున్న జట్టుగా భారత్ నిలిచింది. 2014లో భారత్ తొలిసారి ప్రపంచకప్ గెలుచుకుంది. గతేడాది టి20 వరల్డ్‌కప్ సైతం సొంతం చేసుకుంది.
బౌలింగ్‌లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్‌స ఆడిన సునీల్ రమేష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది.
రిషబ్ పంత్ సూపర్ ఫాస్ట్ సెంచరీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (38 బంతుల్లో 116 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్‌స ఆడాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి.. భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డుని నెలకొల్పాడు. జనవరి 14న ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కేవలం 11.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఢిల్లీ విజయాన్నందుకుంది.
వేగవంతమైన సెంచరీ రికార్డులో.. పంత్ కంటే ముందు వరుసలో గేల్ (30 బంతుల్లో 100) ఉన్నాడు. 2013 ఐపీఎల్‌లో పుణే వారియర్స్‌పై బెంగళూరు తరఫున గేల్ ఈ ఘనత సాధించాడు.
పీబీఎల్ 2017-18 చాంపియన్ హైదరాబాద్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్‌లో హైదరాబాద్ హంటర్స్ విజేతగా నిలిచింది. జనవరి 14న హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో హైదరాబాద్ 4-3 స్కోరుతో బెంగళూరు బ్లాస్టర్స్‌పై విజయం సాధించి.. తొలిసారి పీబీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.
స్కీయింగ్‌లో భారత్‌కు తొలి అంతర్జాతీయ పతకం హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అమ్మాయి అంచల్ ఠాకూర్ స్కీయింగ్‌లో దేశానికి తొలి అంతర్జాతీయ పతకం అందించింది. టర్కీలో అంతర్జాతీయ స్కీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ఫైన్ ఎజ్డర్ 3200 కప్‌లో స్లాలోమ్ రేస్ విభాగంలో అంచల్ కాంస్య పతకం గెలిచింది.
జాతీయ సీనియర్ కబడ్డీ చాంప్స్ హిమాచల్, మహారాష్ట్రజాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ - 2017లో హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర జట్లు విజేతలుగా నిలిచాయి. జనవరి 5న హైదరాబాద్‌లోని బాలయోగి స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 38-35తో ఇండియన్ రైల్వేస్‌పై గెలుపొంది టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల టైటిల్ పోరులో మహారాష్ట్ర 34-29తో సర్వీసెస్‌ను ఓడించింది. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షులు జేఎస్ గెహ్లాట్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
డోపింగ్‌లో పట్టుబడ్డ యూసుఫ్ పఠాన్ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ డోపింగ్‌లో పట్టుబడి.. ఐదు నెలల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గతేడాది మార్చి 16న అతడి నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించింది. అయితే ఫలితాలు ఆలస్యంగా రావడంతోపాటు, యూసుఫ్ పఠాన్ ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌కు పాల్పడకపోవడంతో బోర్డు అతని నిషేధాన్ని తగ్గించింది. గతేడాది నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషిద్ధ ఉత్ప్రేరకం ‘టెర్బుటలైన్’ తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలోని మెడిసిన్. అయితే దీన్ని యూసుఫ్ దగ్గుమందు ద్వారా తీసుకున్నాడు. నేరుగా కాకుండా అస్వస్థతలో తెలియక తీసుకోవడంతో అతనికి నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దీనిపై అతను ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందిన బీసీసీఐ ఐదు నెలల నిషేధంతో సరిపెట్టింది. 2018 జనవరి 14న ఈ నిషేధం ముగుస్తుందని బోర్డు ప్రకటించింది.
టాటా ఓపెన్ మహారాష్ట్ర విజేత సిమోన్టాటా ఓపెన్ మహారాష్ట్ర టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ టెన్నిస్ ప్లేయర్ గైల్స్ సిమోన్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సిమోన్ ఫైనల్లో 7-6 (7/4), 6-2తో ప్రపంచ 14వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. విజేతగా నిలిచిన సిమోన్‌కు 89,435 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 56 లక్షల 65 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఫెడరర్, బెన్సిచ్‌లకు హాప్‌మన్ కప్ - 2017ప్రతిష్టాత్మక హాప్‌మన్ కప్‌లో రోజర్ ఫెడరర్, బెలిండా బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు విజేతగా నిలిచింది. జనవరి 6న జరిగిన ఫైనల్లో ఫెడరర్, బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు 2-1తో అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎంజెలిక్ కెర్బర్ సభ్యులుగా ఉన్న జర్మనీ జట్టును ఓడించింది. తొలుత ఫైనల్స్ పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఫెడరర్ 6-7 (4/7), 6-0, 6-2తో జ్వెరెవ్‌పై గెలిచి స్విట్జర్లాండ్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మహిళల సింగిల్స్‌లో కెర్బర్ 6-4, 6-1తో బెన్సిచ్‌ను ఓడించి స్కోరును 1-1తో సమం చేసింది. నిర్ణాయక మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో ఫెడరర్-బెన్సిచ్ జోడీ 4-3 (5/3), 4-2తో కెర్బర్-జ్వెరెవ్ జంటను ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకుంది.
30 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టోర్నీలో స్విట్జర్లాండ్ విజేతగా నిలువడం ఇది మూడోసారి. 2001లో మార్టినా హింగిస్‌తో కలిసి ఫెడరర్ ఈ టోర్నీలో టైటిల్ నెగ్గగా... 1992లో జాకబ్ హసెక్, మాన్యుయెలా మలీవా తొలిసారి స్విట్జర్లాండ్‌ను చాంపియన్‌గా నిలబెట్టారు.
యాషెస్ సీరీస్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియాఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సీరీస్‌ని ఆస్ట్రేలియా 4-0తో గెలుచుకుంది. జనవరి 8న ముగిసిన సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్‌స 123 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కమిన్‌సకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’.. కెప్టెన్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాలు లభించాయి.
వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ - 2017 విజేత ఆనంద్ మాజీ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆనంద్ నిర్ణీత 15 రౌండ్లు ముగిసేసరికి 10.5 పాయింట్లతో వ్లాదిమర్ ఫెడసీవ్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అయితే కచ్చితమైన ఫలితం కోసం ఇరువురి మధ్య నిర్వహించిన రెండు టైబ్రేక్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆనంద్.. టైటిల్ విజేతగా నిలిచాడు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 9.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 15 రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లతో 22వ స్థానాన్ని సంపాదించింది.
రంజీ ట్రోఫీ - 2017 చాంపియన్ విదర్భ విదర్భ జట్టు రంజీ ట్రోఫీ సరికొత్త విజేతగా నిలిచింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జనవరి 1న ముగిసిన ఫైనల్లో విదర్భ 9 వికెట్ల తేడాతో ఏడుసార్లు ఛాంపియన్ అయిన ఢిల్లీపై విజయం సాధించి.. ప్రతిష్ఠాత్మక దేశవాళీ కప్‌ను సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ సహా మొత్తం 8 వికెట్లు తీసిన గుర్బానీకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రంజీ ట్రోఫీ గెలిచిన విదర్భ జట్టుకు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది.
వరల్డ్ బ్లిట్జ్ చెస్ టోర్నీలో ఆనంద్‌కు కాంస్యం వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్... ఆ వెంటనే జరిగిన బ్లిట్జ్ టోర్నీలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో జరిగిన 21 గేమ్‌లలో అతను ఒక్కటి మాత్రమే ఓడాడు. తన దృష్టిలో ఇది చాలా గొప్ప ప్రదర్శనగా ఆనంద్ విశ్లేషించాడు.

No comments:
Post a Comment