Saturday, 15 April 2017

ఏప్రిల్ 2017 స్పోర్ట్స్

సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీలకు నూతన డీజీలు సీఆర్‌పీఎఫ్, ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీసు దళాలకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 26న నూతన డెరైక్టర్ జనరల్‌లను నియమించింది. సీఆర్‌పీఎఫ్ డీజీగా 1983 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రాయ్ భట్నాగర్, ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ దళాల డీజీగా 1983 బ్యాచ్ ఐపీఎస్ ఆర్‌కే పచనంద నియమితులయ్యారు. ఇంతకముందు సీఆర్‌పీఎఫ్ డీజీగా ఉన్న దుర్గాప్రసాద్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయటంతో సుదీప్ లక్తాకియా తాత్కాలిక డీజీగా వ్యవహరించారు. 


సృష్టి కౌర్‌కు మిస్ టీన్ యూనివర్స్ కిరీటం భారతీయ టీనేజర్ సృష్టి కౌర్ మిస్ టీన్ యూనివర్స్ కిరీటం - 2017ను సొంతం చేసుకున్నారు. ఈ మేరకు నికరాగ్వాలోని మనాగ్వా నగరంలో ఏప్రిల్ 26న జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ఇదే పోటీల్లో ఉత్తమ జాతీయ కాస్ట్యూమ్ విభాగంలోనూ సృష్టి అవార్డుని సొంతం చేసుకున్నారు. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న యువతులకు ఈ పోటీలు నిర్వహిస్తుంది. 


ఐఓసీ కమిషన్ సభ్యురాలిగా నీతా అంబానీ ప్రతిష్టాత్మక ఒలింపిక్ చానల్ కమిషన్, ఒలింపిక్ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలిగా నీతా అంబానీ నియమితులయ్యారు. ఈ మేరకు ఐఓసీ ఏప్రిల్ 26న ప్రకటించింది. 2016 రియో ఒలింపిక్స్‌తో ప్రారంభమైన చానల్‌లో మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు. దీనికి యునెటైడ్ స్టేట్స్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ లారెన్స్‌ ఫ్రాన్సిస్ నేతృత్వం వహిస్తారు. మాడ్రిడ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ చానల్ ఏడాది మొత్తం ఒలింపిక్ క్రీడలు, విలువలను ప్రమోట్ చేస్తుంది. 24 మంది సభ్యులు గల ఒలింపిక్ ఎడ్యుకేషన్ కమిషన్‌లోనూ నీతా అంబానీ సభ్యురాలిగా కొనసాగుతారు. ఈ బృందానికి బారీ జాన్ మైస్టర్ (న్యూజిలాండ్) నేతృత్వం వహిస్తారు.
రిలయన్స్‌ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన నీతా అంబానీ 2016లో ఐఓసీ సభ్యురాలిగా ఎన్నికవడం ద్వారా ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. 

కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త చైర్మను్లతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాలు, వివాదాల పరిష్కారం కోసం ఏర్పడిన కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్ర జలసంఘం పూర్తి స్థాయి చైర్మన్లను నియమించింది. కృష్ణాబోర్డుకు ఎస్‌కే శ్రీవాత్సవను, గోదావరి బోర్డుకు హెచ్‌కే సాహును చైర్మన్లుగా నియమిస్తూ కేంద్ర జల సంఘం చైర్మన్ నరేంద్ర కుమార్ ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేశారు. 
ఇంతకముందు ఎస్‌కే శ్రీవాత్సవ పుణేలో నేషనల్ వాటర్ అకాడమీ చీఫ్ ఇంజనీర్ స్థారుులో విధులు నిర్వర్తించారు. హెచ్‌కే సాహూ తీస్తా బేసిన్ ఆర్గనైజేషన్(టీబీఓ) పశ్చిమబెంగాల్ శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా పని చేశారు.


బాలీవుడ్ నటుడు, ఎంపీ వినోద్ ఖన్నా కన్నుమూత ప్రముఖ బాలీవుడ్ నటుడు, లోక్‌సభ ఎంపీ వినోద్ ఖన్నా(70) ఏప్రిల్ 27న ముంబైలో కన్నుమూశారు. వినోద్ ఖన్నా 1968లో ‘మన్ కా మీత్’తో సినీ రంగ ప్రవేశం చేశారు. తొలినాళ్లలో ప్రతినాయకుడు, సహాయక పాత్రల్లో కన్పించిన ఆయన 1971లో గుల్జార్ సినిమా ‘మేరే అప్నే’తో హీరోగా గుర్తింపు పొందారు. చివరిసారిగా 2015లో షారూక్ ఖాన్ సినిమా దిల్‌వాలేలో నటించారు. రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవరించిన ఖన్నా, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ తరఫున నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. 

పిచాయ్‌కు 198 మిలియన్ డాలర్ల గూగుల్ స్టాక్ అవార్డు గూగుల్ సీఈవో, భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ 2016 ప్రతిఫలంగా (స్టాక్ అవార్డు) కంపెనీ నుంచి భారీ మొత్తం అందుకున్నారు. ఈ మేరకు 2016 సంవత్సరానికి 198.7 మిలియన్ డాలర్లను(దాదాపు రూ. 1291 కోట్లు) పిచాయ్‌కు గూగుల్ సంస్థ ఏప్రిల్ 28న అందజేసింది. 2015లో స్టాక్ అవార్డు(99.8 మిలియన్ డాలర్లు) కింద ఆయన అందుకున్న దానికి ఇది రెండింతలు. అలాగే పిచాయ్ 2016లో వేతనంగా 6.5 లక్షల డాలర్లు (4.22 కోట్లు) అందుకున్నారు. 
సుందర్ పిచాయ్ ఆగస్టు 2015లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గూగుల్ భారీ లాభాలను ఆర్జించింది. ప్రకటనల విభాగం, యూట్యూబ్ బిజినెస్‌లు బాగా పెరిగారుు. అలాగే మెషీన్ లెర్నింగ్, హార్డ్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 2016లో గూగుల్ నుంచి స్మార్ట్‌ఫోన్ కూడా విడుదలైంది. 


టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఈ మేరకు 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సింఘాల్‌ను ఈవోగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మే 1న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీటీడీ చరిత్రలో ఈవో పదవి చేపట్టిన మొట్టమొదటి ఉత్తరాది వ్యక్తిగా సింఘాల్ నిలిచారు. 
ప్రస్తుత టీటీడీ ఈవో డి.సాంబశివరావును వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల (రెవెన్యూ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసిన ప్రభుత్వం కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ప్రవీణ్ ప్రకాష్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించింది.

సీఐఐ ప్రెసిడెంట్‌గా శోభన కామినేనిఅపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్‌గా ఉన్న శోభన కామినేని ప్రతిష్టాత్మక భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ/ సీఐఐ) చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు 2017-18 సంవత్సరానికి నూతన పాలక మండలిని సీఐఐ ఏప్రిల్ 30న ప్రకటించింది. శోభన ప్రస్తుతం కేఈఐ గ్రూపు వైస్ చైర్‌పర్సన్‌గానూ ఉన్నారు. కోటక్ మహింద్రా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ సీఐఐ నూతన వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు. 


పీఏసీ చైర్మన్‌గా మల్లిఖార్జున్ ఖర్గేపార్లమెంట్ ప్రజా పద్దుల కమిటీ (Public Accounts Committee) కొత్త చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ కేవీ థామస్ పదవీకాలం ఏప్రిల్ 30న ముగియడంతో ఖర్గే బాధ్యతలు చేపట్టారు. ప్రతిపక్ష నేత అధ్యక్షత వహించే ఈ కమిటీలో ప్రస్తుతం 21 మంది సభ్యులున్నారు.


‘టైమ్’ అత్యంత ప్రభావశీలుర జాబితాలో మోదీ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన వందమంది వ్యక్తుల జాబితాలో భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చోటు సంపాదించారు. ఈ మేరకు 2017కు సంబంధించిన జాబితాను టైమ్ మేగజీన్ ఏప్రిల్ 20న విడుదల చేసింది. 
ఆయా రంగాల్లో మార్గదర్శకులుగా నిలిచినవారు, కళాకారులు, నేతలు, ప్రముఖులకు ఈ జాబితాలో చోటు లభించింది. జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా మే పేర్లు కూడా ఉన్నాయి. ఈ జాబితాను టైమ్ మేగజిన్ ఎడిటర్లు రూపొందించారు. 

పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌పై దర్యాప్తుకు జిట్ ఏర్పాటు పనామా పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై దర్యాప్తు జరిపేందుకు సంయుక్త దర్యాప్తు బృందం (జిట్) ఏర్పాటైంది. ఈ మేరకు ఆ దేశ సుప్రీం కోర్టు ఏప్రిల్ 20న జిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐఎస్‌ఐ, మిలిటరీ ఇంటెలిజెన్‌‌స, ఎఫ్‌ఐఏ, ఎన్‌ఏబీ, సెక్యూరిటీ, ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ సహా కీలక సంస్థలకు చెందిన అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. షరీఫ్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్ జిట్ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 


భారత మహిళల క్రికెట్ కోచ్‌గా తుషార్ అరోథే భారత మహిళల క్రికెట్ హెడ్ కోచ్ పదవి నుంచి పూర్ణిమా రావును తప్పిస్తూ బీసీసీఐ ఏప్రిల్ 21న నిర్ణయం తీసుకుంది. ఆమె స్థానంలో బరోడా మాజీ క్రికెటర్ తుషార్ అరోథేను హెడ్ కోచ్ పదవికి ఎంపిక చేసింది. 2017 జూన్‌లో భారత్‌లో మహిళల ప్రపంచ క్రికెట్ కప్ జరగనుంది. 


అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపినవ్యోమగామిపెగ్గీ విట్సన్నాసాకు చెందిన వ్యోమగామి పెగ్గీ విట్సన్ క్రమం తప్పకుండా ఎక్కువ రోజులపాటు అంతరిక్షం (స్పేస్)లో గడిపిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ మేరకు గతంలో 534 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన జెఫ్ విలియమ్స్ రికార్డును పెగ్గీ ఏప్రిల్ 24న అధిగమించారు. ఆమె భూమికి తిరిగొచ్చే సమయానికి అంతరిక్షంలో 650 రోజులు గడిపిన వ్యోమగామిగా మరో రికార్డును నెలకొల్పుతారని నాసా ప్రకటించింది. దాదాపు 53 గంటలపాటు నిర్విరామంగా స్పేస్‌వాక్ చేసిన మహిళా వ్యోమగామి రికార్డు కూడా పెగ్గీ పేరిటే ఉంది. 


గాంధీ ఇన్ చంపారన్ పుస్తకావిష్కరణడీజీ టెండూల్కర్ ర చించిన "గాంధీ ఇన్ చంపారన్ " పుస్తకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏప్రిల్ 9న ఆవిష్కరించారు. సత్యాగ్రహ ఉద్యమంలో మహాత్మా గాంధీ అవలంబించిన విధానాలను, ఆయన జీవిత లక్ష్యాలను ఈ పుస్తకంలో వివరించారు.
డీజీ టెండూల్కర్ ఇది వరకే Mahatma: Life of Mohandas Karamchand Gandhi పేరుతో గాంధీజీ జీవిత చరిత్రను రచించారు. ఇది 8 సంపుటాల్లో విడుదలైంది. 


యూఎన్‌డీపీ అడ్మినిస్ట్రేటర్‌గా అచిమ్ స్టెయినర్ ఐక్యరాజ్య సమితి కార్యకలాపాల్లో అపార అనుభవం ఉన్న అచిమ్ స్టెయినర్ యూఎన్‌డీపీ (United Nations Development Programme) అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటై ఏప్రిల్ 13న ప్రకటించారు. యూఎన్‌డీపీ కేంద్ర కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. ఇది ప్రపంచ దేశాల్లో పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి, మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది. 


కంప్యూటర్ శాస్త్రవేత్త రాబర్ట్ టేలర్ మృతి ఇంటర్‌నెట్‌కు బీజం వేయటంతో పాటు పర్సనల్ కంప్యూటర్‌ను అభివృద్ధి పరచటంలో కీలక పాత్ర పోషించిన కంప్యూటర్ శాస్త్రవేత్త రాబర్ట్ టేలర్ (85) ఏప్రిల్ 16న అమెరికాలో కన్నుమూశారు. ఆయన 1966లో పెంటగాన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీలో పనిచేస్తున్న సమయంలో సహోద్యోగులతో సంభాషించేందుకు తన నేతృత్వంలో అర్ఫానెట్‌ను సృష్టించి అన్ని కంప్యూటర్లను అనుసంధానం చేశారు. తదనంతర కాలంలో అదే ఇంటర్‌నెట్‌గా పరిణామం చెందింది. 


టైమ్-100 రీడర్స్ పోల్‌లో డ్యుటెర్టోకు అగ్రస్థానం ‘టైమ్-100’ ప్రభావశీల వ్యక్తుల కోసం నిర్వహించిన రీడర్ పోల్‌లో ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టో అగ్రస్థానంలో నిలిచారు. 2016లో అత్యంత ప్రభావశీల వ్యక్తుల ఎంపిక కోసం జరిపిన పోల్ ఫలితాలను టైమ్ సంస్థ ఏప్రిల్ 17న వెల్లడించింది. ఇందులో డ్యుటెర్టోకు అత్యధికంగా 5 శాతం ఓట్లు రాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, పోప్ ఫ్రాన్సిస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌లకు 3% చొప్పున వచ్చాయి. 

ఫోర్బ్స్ 30 జాబితాలో 53 మంది భారతీయులు ఫోర్బ్స్ ‘30 అండర్ 30 ఆసియా’ జాబితాలో 53 మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు వివిధ రంగాల్లో సత్తా చాటిన 30 ఏళ్లలోపు యువ అఛీవర్స్ జాబితాను ఫోర్బ్స్ ఏప్రిల్ 17న విడుదల చేసింది. 
వినోదం, ఆర్థికం, రిటైల్, క్రీడలు ఇలా పది రంగాల్లో 30 మంది చొప్పున 300 మందితో ఈ జాబితా రూపొందించింది. ఇందులో భారత్ నుంచి దీపా కర్మాకర్, సాక్షిమాలిక్, ఆలియాభట్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన రోహిత్ పోతుకూచి, కరీంనగర్‌కు చెందిన చిలప్పగరి సుధీంద్ర తదితరులున్నారు. చైనా నుంచి 76 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది.


రుణ ఎగవేతదారు విజయ్ మాల్యా అరెస్టువేలకోట్ల రుణాలను ఎగవేసి లండన్‌లో తలదాచుకున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను ఏప్రిల్ 18న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. మాల్యాను భారత్ రప్పించే ప్రక్రియలో భాగంగా బ్రిటన్‌తో జరిపిన సంప్రదింపుల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగిందని స్కాట్‌లాండ్ పోలీసులు తెలిపారు. అయితే అరెస్టయిన గంటలోపే వెస్ట్‌మినిస్టర్ కోర్టు మాల్యాకు బెయిల్ మంజూరు చేసింది. భారత్, బ్రిటన్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు మాల్యాను అప్పగించాలంటూ భారత్ ఫిబ్రవరి 8న అధికారికంగా విజ్ఞప్తి చేసింది.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమానాల కొనుగోలుకు ఐడీబీఐ, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఇండియా బ్యాంక్‌ల నుంచి వేల కోట్ల అప్పు తీసుకున్న మాల్యా వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్‌‌సకు ఇచ్చిన రూ.6,493 కోట్ల రుణాలను తిరిగి చెల్లించాలంటూ యునెటైడ్ బ్రూవరీస్‌కు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అప్పులిచ్చిన బ్యాంకుల కన్సార్షియం అల్టిమేటం జారీ చేసింది. అయినా అప్పులు చెల్లించకపోవడంతో బ్యాంకులు మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించాయి. దీంతో 2016లో మాల్యా లండన్ పారిపోయాడు.


షీలా పటేల్‌కు ఐక్యరాజ్యసమితి పదవిపద్మశ్రీ అవార్డు గ్రహీత, స్పార్క్ (సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఏరియా రిసోర్స్ సెంటర్స్) వ్యవస్థాపకురాలు షీలా పటేల్ ఏప్రిల్ 13న ఐక్యరాజ్యసమితి పట్టణ పేదరిక నిర్మూలన కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.

బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా మృతిభారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా (56) ఏప్రిల్ 12న న్యూఢిల్లీలో గుండెపోటుతో మరణించారు.

శిల్పకారుడు నందగోపాల్ కన్నుమూతప్రతిముఖ శిల్పకారుడు ఎస్.నందగోపాల్ (71) అనారోగ్యంతో ఏప్రిల్ 14న చెన్నైలో మరణించారు. ఆయనకు 1970లో జాతీయ అవార్డు, 1978లో లలిత కళా అకాడమీ అవార్డు దక్కాయి.

19వ శతాబ్దపు చివరి వ్యక్తిమార్టినా మోరానోప్రతిపంచంలోనే అత్యధిక వయస్సున్న బామ్మగా రికార్డుల్లోకెక్కిన ఎమ్మా మార్టినా మోరానో (117) ఇటలీలోని వెర్బానియాలో ఏప్రిల్ 15న మరణించారు. 1899, నవంబర్ 29న ఇటలీలో జన్మించిన మార్టినా మరణించేంత వరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.

నాస్కామ్ కొత్త చైర్మన్‌గా రామన్ రాయ్ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ కొత్త చైర్మన్‌గా రామన్ రాయ్ నియమితులయ్యారు. క్వాట్రో సీఎండీగా ఉన్న ఈయన 2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ సంస్థ చీఫ్‌గా కొనసాగుతారు. అలాగే నాస్కామ్ వైస్ చైర్మన్‌గా రిషద్ ప్రేమ్‌జీ ఎంపికయ్యారు. అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడైన ఈయన విప్రో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆర్. చంద్రశేఖర్ నాస్కామ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 


కేసుల తీర్పుల్లో యూపీ న్యాయమూర్తి గిన్నిస్ రికార్డ్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ కోర్టు న్యాయమూర్తి తేజ్ బహదూర్ సింగ్ 327 రోజుల్లో 6,065 కేసులు పరిష్కరించి గిన్నిస్ రికార్డ్డు సృష్టించారు. ఈ మేరకు సింగ్ ఘనతను గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ఏప్రిల్ 7న ధ్రువీకరించారు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని కేసులను పరిష్కరించడం దేశంలోనే తొలిసారని బార్ అసోసియేషన్ తెలిపింది. కాగా సింగ్ పరిష్కార తీర్పుతో 903 జంటలు తిరిగి ఒక్కటయ్యాయి. 


ఐరాస శాంతిదూతగా మలాలాబాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ (19) ఐక్యరాజ్య సమితి శాంతిదూతగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ మూడో వారంలో జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ హోదా ఇవ్వనున్నట్లు యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఏప్రిల్ 8న ప్రకటించారు. దీంతో యూఎన్ శాంతిదూతగా నియమితురాలైన అత్యంత పిన్న వయస్కురాలుగా మలాలా గుర్తింపు పొందింది. 


శివసేన ఎంపీ గైక్వాడ్‌పై ఎఫ్‌ఐఏ నిషేధం ఎత్తివేత శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్‌ఐఏ) విధించిన నిషేధాన్ని ఏప్రిల్ 9న ఎత్తివేసింది. మార్చి 23న విమానం సీటు విషయంలో గైక్వాడ్ ఆవేశంతో ఎన్స్ర్ ఇండియా ఉద్యోగిని 25సార్లు చెప్పుతో కొట్టారు. దీంతో ఎన్స్ర్ ఇండియాతోపాటు ప్రైవేటు విమానయాన సంస్థలు గైక్వాడ్ ప్రయాణంపై నిషేధం విధించాన్స్. అయితే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్స్రిండియా సంస్థకు పౌరవిమానయాన శాఖ లేఖ రాయడంతో ఆయనపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. 


ఏఎస్‌ఆర్‌టీయూ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా రమణారావు టీఎస్‌ఆర్టీసీ ఎండీ రమణారావు అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్‌‌సపోర్టు అండర్‌టేకింగ్‌‌స (ఏఎస్‌ఆర్‌టీయూ) స్థాయి సంఘం చైర్‌పర్సన్‌గా ఏప్రిల్ 10న నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. సంఘంలో 15 మంది సభ్యులు ఉంటారు. 
రోడ్డు రవాణా సంస్థలు ఉమ్మడిగా అమలు చేయాల్సిన నిబంధనలు రూపొందించడంలో ఈ స్థాయి సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. రోడ్డు రవాణా సంస్థలకు సూచనలు ఇవ్వడంతోపాటు అత్యంత కీలకమైన రవాణా విధానం రూపొందించటంలో కేంద్రానికి సిఫార్సులు చేస్తుంది. 


సుమిత్రా మహాజన్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ రాసిన "మాతోశ్రీ" పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 11న పార్లమెంట్ గ్రంథాలయ బిల్డింగ్‌లో ఆవిష్కరించారు. 1767 నుంచి 1795 మధ్య మాల్వా ప్రాంతంలో విస్తరించిన హోల్కర్ సామ్రాజ్యాన్ని పాలించిన దేవీ అహల్యాబాయి హోల్కర్ జీవితాన్ని, నాటి పరిస్థితులను సుమిత్రా మహాజన్ పుస్తకంలో వివరించారు. 


కర్ణాటక మాజీ సీఎంలపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం అక్రమ గనుల తవ్వకాల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు ఎన్.ధరమ్ సింగ్, హెచ్‌డీ కుమారస్వామిల పాత్రపై విచారణ జరపాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ మార్చి 29న ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పింది. దీంతో బళ్లారి జిల్లాలో 11,797 చదరపు కిలో మీటర్ల అటవీ భూమిని డీ-రిజర్వ్ చేసిన విషయంలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులతోపాటు మరికొందరు అధికారులపై విచారణ సాగనుంది. మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం. కృష్ణకు మాత్రం విచారణ నుంచి మినహాయింపు లభించింది. 


ఎస్‌ఐగా నియమితులైన తొలి హిజ్రాతమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ప్రీతికా యాషిని దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. ఆమెకు ధర్మపురి (తమిళనాడు)లో పోస్టింగ్ ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రీతి పటేల్‌కు ప్రవాసీ సమ్మాన్ పురస్కారంభారత సంతతికి చెందిన బ్రిటన్ సీనియర్ మంత్రి ప్రీతి పటేల్ మార్చి 27న ప్రవాసీ భారతీయ సమ్మాన్-2017 పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం ఆమె బ్రిటన్ అంతర్జాతీయ వ్యవహారాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

ప్రపంచ అందగత్తెల్లో ప్రియాంకకు రెండోస్థానంప్రపంచంలోనే అత్యంత అందమైన 30 మంది మహిళల్లో భారతీయ నటి ప్రియాంకా చోప్రాకు రెండోస్థానం లభించింది. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ బజ్‌ఫీడ్ నిర్వహించిన పోల్‌లో హాలీవుడ్ తారలు ఏంజెలినా జోలీ, ఎమ్మా వాట్సన్, బ్లాక్ లివ్లీ తదితరులను వెనక్కి నెట్టి ప్రియాంక రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నారు. పాప్ గాయని బియాన్స్ మొదటిస్థానంలో నిలవగా ప్రముఖ మోడల్ టేలర్ హిల్ మూడోస్థానం దక్కించుకున్నారు. 


ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కనుంగొ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త డిప్యూటీ గవర్నర్‌గా బి.పి. కనుంగో ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్న ఆయన కరెన్సీ మేనేజ్‌మెంట్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ వంటి విభాగాలకు నాయకత్వం వహించనున్నారు. 


హిందుస్తానీ గాయకురాలు అమోంకర్ మృతిప్రముఖ హిందుస్తానీ గాయకురాలు కిశోరీ అమోంకర్ (84) ఏప్రిల్ 3న ముంబైలో కన్నుమూశారు. 1932లో జన్మించిన అమోంకర్ గాయకురాలైన తన తల్లి మోగుబాయి కుర్దికర్ నుంచి తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు. ఆమె 1987లో పద్మభూషణ్, 2002లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. 


ఈక్వెడార్ అధ్యక్షుడిగా లెనిన్ మారెనో ఈక్వెడార్ అధ్యక్షుడిగా పెయిస్ అలయెన్స్ పార్టీకి చెందిన లెనిన్ మారినో ఎన్నికయ్యారు. ఈ మేరకు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లెనిన్‌కు 51.16 శాతం ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి గిల్లర్‌మో లాస్సో (కన్జర్వేటివ్ పార్టీ)కు 48.04 శాతం ఓట్ల వచ్చాయి. 
లెనిన్ మారినో 2007 నుంచి 2013 వరకూ ఈక్వెడార్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.


ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రాజీవ్ కుమార్ ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాజీవ్ కుమార్ చందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ 4న విదేశీ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 1983 ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ కుమార్ 2006 నుంచి 2009 వరకు ఐరాసలో భారత మిషన్ డిప్యూటీ పర్మనెంట్ మెంబర్‌గా పనిచేశారు. 

Wednesday, 22 March 2017

మార్చి 2017 స్పోర్ట్స్

ఆటగాళ్ల వార్షిక ఫీజుని రెట్టింపు చేసిన బీసీసీఐ2016-17 సీజన్‌కు సంబంధించిన కొత్త కాంట్రాక్ట్‌లో భారత క్రికెట్ ఆటగాళ్ల వార్షిక ఫీజులని రెట్టింపు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 32 మంది ఆటగాళ్లతో కూడిన కాంట్రాక్ట్ జాబితాను మార్చి 22న వెల్లడించింది. దీంతో పాటు మ్యాచ్ ఫీజులను కూడా పెంచింది. ఇకపై ఒక టెస్టు మ్యాచ్ ఆడితే ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు లభిస్తాయి. టెస్టుల్లో రిజర్వ్ ఆటగాడికి రూ. 7 లక్షలు దక్కుతాయి. ఒక్కో వన్డేకు రూ. 6 లక్షలు, ఒక్కో టి-20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు అందజేస్తారు. పెంచిన ఫీజులు 2016, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 
కొత్త కాంట్రాక్ట్‌ల జాబితాగ్రేడ్ ‘ఎ’ (రూ. 2 కోట్లు): విరాట్ కోహ్లి, ధోని, అశ్విన్, అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్, రవీంద్ర జడేజా.
గ్రేడ్ ‘బి’ (రూ. 1 కోటి): రోహిత్ శర్మ, భువనేశ్వర్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్ (ప్రమోషన్), వృద్ధిమాన్ సాహా (ప్రమోషన్).
గ్రేడ్ ‘సి’ (రూ. 50 లక్షలు): శిఖర్ ధావన్ (దిగువకు), అంబటి తిరుపతి రాయుడు (దిగువకు), అమిత్ మిశ్రా, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా, కేదార్ జాదవ్, యజువేంద్ర చహల్, పార్థివ్ పటేల్, జయంత్ యాదవ్, మన్‌దీప్ సింగ్, ధావల్ కులకర్ణి, శార్దుల్ ఠాకూర్, రిషభ్ పంత్ (వీరిలో మిశ్రా, అక్షర్, ధావల్ గత ఏడాది కూడా ‘సి’లోనే ఉండగా మిగతా 11 మందికి తొలిసారి కాంట్రాక్ట్ లభించింది)
స్థానం కోల్పోయినవారు: సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, వరుణ్ ఆరోన్, కరణ్ శర్మ, శ్రీనాథ్ అరవింద్. 


ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో అంకుర్ మిట్టల్‌కు స్వర్ణం మెక్సికోలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్‌లో అంకుర్ మిట్టల్ స్వర్ణం సాధించాడు. ఈ మేరకు మార్చి 23న జరిగిన డబుల్ ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో 80 పాయింట్లకు గాను 75 పాయింట్ల సాధించి చాంపియన్‌గా నిలిచాడు. ఇటీవల భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన అంకుర్ రజత పతకాన్ని పొందాడు.

మహిళల ప్రొఫెషనల్స్ గోల్ఫ్ టూర్ విజేత వాణి కపూర్ హీరో వుమెన్స్ ప్రొఫెషనల్స్ గోల్ఫ్ టూర్ టైటిల్‌ను ఢిల్లీకి చెందిన వాణి కపూర్ సొంతం చేసుకున్నారు. ఈ మేరకు పుణెలో మార్చి 25న జరిగిన చివరి రోజు పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. గోల్ఫ్ టూర్స్‌లో ఇది ఆమెకు రెండో టైటిల్. సమాన్ స్కోర్లతో గౌరికా బిషోణి, అమన్‌దీప్ డ్రాల్ రెండో స్థానంలో నిలిచారు. 


2017 ఫార్ములావన్ సీజన్ తొలిరేసు విజేత వెటెల్ 2017 ఫార్ములావన్ సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సెబేస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. మార్చి 26న జరిగిన 57 ల్యాప్‌ల ఈ రేసులో వెటెల్ గంటా 24 నిమిషాల 11.670 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2015 సెప్టెంబరులో సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన తర్వాత వెటెల్ ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే. ఓవరాల్‌గా వెటెల్ కెరీర్‌లో ఇది 43వ టైటిల్. 


బోర్డర్ గావస్కర్ టెస్ట్ సీరీస్ విజేత భారత్ ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ టెస్ట్ సీరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ధర్మశాలలో జరిగిన నాల్గొవ టెస్టులో విజయం సాధించడం ద్వారా మూడేళ్ల తర్వాత ఈ సీరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ద సీరీస్ అవార్డు అందుకున్నాడు. 
ఈ విజయంతో టెస్టుల్లో నెంబర్ 1 స్థానాన్ని పటిష్ట పరుచుకున్న టీమిండియా ఐసీసీ నుంచి టెస్టు గదతో పాటు పది లక్షల డాలర్ల నగదు బహుమతి అందుకుంది. కాగా సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా ఏడవ టెస్టు సిరీస్ విజయం. 

ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ విజేత ఫెడరర్ 
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో మార్చి 20న జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6-4, 7-5తో స్టానిస్లాస్ వావ్రింకాపై విజయం సాధించాడు. ఈ విజయంతో ఇండియన్ వెల్స్ టోర్నీని అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన నొవాక్ జకోవిచ్ (సెర్బియా) రికార్డును ఫెడరర్ సమం చేశాడు. ఓవరాల్‌గా ఫెడరర్ కెరీర్‌లో ఇది 90వ సింగిల్స్ టైటిల్‌కాగా 25వ మాస్టర్స్ సిరీస్ టైటిల్. 
మహిళల సింగిల్స్ విభాగంలో ఎలీనా వెస్నినా (రష్యా) స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా)పై గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. 


గ్యాటోరెడ్ అంబాసిడర్‌గా పీవీ సింధుఅమెరికాకు చెందిన ప్రఖ్యాత స్పోర్‌‌ట్స డ్రింక్ ‘గ్యాటోరెడ్’కు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. ఈ మేరకు ఆ సంస్థ మార్చి 20న సింధుతో ఒప్పందం కుదుర్చుకుంది. పెప్సికో సంస్థ ఈ పానీయాన్ని ఉత్పత్తి చేస్తుంది. గతంలో స్టార్ ప్లేయర్స్ ఉసేన్ బోల్ట్ (అథ్లెటిక్స్), సెరెనా విలియమ్స్ (టెన్నిస్), మెస్సీ (ఫుట్‌బాల్) తదితరులు గ్యాటోరెడ్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరించారు. 


విజయ్ హజారే ట్రోఫీ విజేత తమిళనాడు విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో మార్చి 20న జరిగిన ఫైనల్లో బెంగాల్ జట్టుపై 37 పరుగుల తేడాతో గెలుపొందింది. 
2002లో విజయ్ హజారే టోర్నీలో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతి మొదలయ్యాక తమిళనాడు టైటిల్ నెగ్గడం ఇది ఐదోసారి. మరోవైపు బెంగాల్ జట్టు ఫైనల్‌కు చేరుకున్న నాలుగుసార్లూ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.


ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ 2017లో ఇంగ్లండ్‌లో జరగనున్న ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 24 నుంచి జూలై 23 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. భారత జట్టు జూన్ 24న జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో ఆడనుంది. తొలి సెమీఫైనల్ జూలై 18న, రెండో సెమీఫైనల్ జూలై 20న జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్‌ను జూలై 23న లార్డ్స్ మైదానంలో నిర్వహిస్తారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. 
భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ జూన్ 24 : ఇంగ్లండ్‌తో 
జూన్ 29 : వెస్టిండీస్‌తో 
జూలై 2 : పాకిస్తాన్‌తో 
జూలై 5 : శ్రీలంకతో
జూలై 8 : దక్షిణాఫ్రికాతో
జూలై 12: ఆస్ట్రేలియాతో
జూలై 15: న్యూజిలాండ్‌తో


అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా హెరాత్ రికార్డు ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (366) తీసిన ఎడమ చేతివాటం స్పిన్నర్‌గా శ్రీలంక ప్లేయర్ రంగన హెరాత్ రికార్డు సృష్టించాడు. మార్చి 12న బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ హెరాత్ 9 వికెట్లు తీశాడు. తద్వారా ఇప్పటి వరకూ న్యూజిలాండ్ క్రికెటర్ వెటోరి పేరిట ఉన్న 362 వికెట్ల రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై శ్రీలంక విజయం సాధించింది. 


అంధుల క్రికెట్ జట్టుకు రూ.కోటి నజరానాఇటీవల అంధుల టి-20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ రూ.కోటి నజరానా ప్రకటించింది. గత నెల 25న సమావేశమైన బోర్డు నూతన పరిపాలన కమిటీ (సీఓఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12న బెంగళూరులో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంది.


లీ చోంగ్ వీకి ఆల్ ఇంగ్లండ్ టైటిల్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను మలేషియాకు చెందిన లీ చోంగ్ వీ దక్కించుకున్నాడు. మార్చి 12న జరిగిన ఫైనల్స్‌లో షియూచి (చైనా)పై గెలుపొంది నాలుగోసారి ఈ టైటిల్‌ను అందుకున్నాడు. గతంలో 2010, 2011, 2014లోనూ చోంగ్ టైటిల్ విజేతగా నిలిచాడు. 
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ తై జు యింగ్ (చైనా) ఇంతనోన్ రచనోక్ (థాయిలాండ్)పై గెలుపొంది టైటిల్ సొంతం చేసుకుంది.

ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ విజేత చౌరాసియా భారత గోల్ఫర్ ఎస్‌ఎస్‌పీ చౌరాసియా ఇండియా ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ విజేతగా నిలిచాడు. మార్చి 12న గుర్గావ్‌లోని డీఎల్‌ఎఫ్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌లో జరిగిన పోటీలో ప్రథమ స్థానంలో నిలవటం ద్వారా వరుసగా రెండోసారి చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నాడు. విజేతకు రూ.2 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు. 

క్రికెట్‌లో తండ్రీ కొడుకుల రికార్డువెస్టిండీస్ క్రికెటర్ శివ్‌నారాయణ్ చందర్‌పాల్, ఆయన కుమారుడు త్యాగి నారాయణ్ చందర్‌పాల్ ఒకే మ్యాచ్‌లో కలిసి బ్యాటింగ్ చేసి రికార్డు సృష్టించారు. కింగ్‌స్టన్‌లోని సబీనా పార్కులో జరుగుతోన్న ప్రాంతీయ టోర్నీలో భాగంగా మార్చి 13న జమైకా, గయానా జట్ల మధ్య ఫస్టక్లాస్ మ్యాచ్ జరిగింది. ఇందులో గయానా తరపున ఆడిన వీరిద్దరూ ఆర్ధ శతకాలు సాధించారు. టెస్టు క్రికెట్‌లో 11,867 పరుగులు చేసిన శివ్‌నారాయణ్ బ్రయాన్ లారా తర్వాత విండీస్ రెండో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. 

ప్రపంచకప్ షూటింగ్‌లో జీతూ రాయ్‌కి స్వర్ణం న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ షూటింగ్ టోర్నీలో జీతూ రాయ్(భారత్) స్వర్ణం సాధించాడు. మార్చి 1న జరిగిన 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 230.1 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డ్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో భారత్‌కు ఇది తొలి స్వర్ణం. 226.9 పాయింట్లతో అమన్‌ప్రీత్ సింగ్ (భారత్) రజతం సాధించగా 208 పాయింట్లు స్కోరు చేసిన ఇరాన్ షూటర్ వహీద్ గోల్‌ఖాందన్ కాంస్యం గెలుచుకున్నాడు.

మహిళల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో కింబర్లీ రోడ్ (అమెరికా) 56 పాయింట్లు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సాధించి 5 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.

ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు 5వ స్థానంస్వదేశంలో తొలిసారి జరిగిన ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్ ఐదవ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకూ జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం ఐదు పతకాలు దక్కాయి. ఇందులో ఓ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి.

పురుషుల 50 మీ. పిస్టల్ ఈవెంట్‌లో జీతూ రాయ్ స్వర్ణం సాధించాడు. పతకాల పట్టికలో చైనా, ఇటలీ, ఆస్ట్రేలియా, జపాన్ మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి.


ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ తాన్ జోంగి ఇరాన్‌లోని టెహరాన్‌లో జరిగిన ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్-2017 టైటిల్‌ను చైనా మహిళా గ్రాండ్ మాస్టర్ (WGM) తాన్ జోంగి గెలుచుకుంది. మార్చి 3న జరిగిన ఫైనల్లో తాన్ జోంగి అనా ముజిచుక్ (ఉక్రెయిన్)ను 3.5-2.5 పాయింట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఈ టైటిల్‌తో తాన్ జోంగికి గ్రాండ్ మాస్టర్ (GM) హోదా లభించింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ద్రోణవల్లి హారిక (భారత్), అలెగ్జాండ్రా కోస్టెనిక్ (రష్యా)లకు కాంస్య పతకాలు దక్కాయి. విజేతగా నిలిచిన తాన్ జోంగికి 60 వేల డాలర్లు (రూ. 40 లక్షలు), రన్నరప్ అనా ముజిచుక్‌కు 30 వేల డాలర్లు (రూ. 20 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.


విష్ణువర్ధన్-శ్రీరామ్‌లకు ఐటీఎఫ్ ఫ్యూచర్స్-3 డబుల్స్ టైటిల్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య-ITF ఫ్యూచర్స్-3 టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను విష్ణువర్ధన్-శ్రీరామా బాలాజీ దక్కించుకున్నారు. గువహటిలో మార్చి 3న జరిగిన ఫైనల్స్‌లో వీరు శశికుమార్ ముకుంద్ (భారత్)-తిముర్ ఖాబిబులిన్ (కజకిస్తాన్) జోడీపై గెలిచారు. ఈ విజయంతో విష్ణువర్ధన్ డబుల్స్ టైటిల్స్ సంఖ్య 31కి చేరింది. 


ముర్రేకు దుబాయ్ ఓపెన్ టైటిల్దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీ ముర్రే (బ్రిటన్) గెలుచుకున్నాడు. దుబాయ్‌లో మార్చి 4న జరిగిన ఫైనల్లో ఫెర్నాండో వెర్దాస్కో (స్పెయిన్)పై విజయం సాధించాడు. 

టీమిండియా కొత్త స్పాన్సరర్‌గా ఒప్పోటీమిండియా కొత్త స్పాన్సరర్‌గా ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో వ్యవహరించనుంది. ఈ మేరకు ఆ సంస్థ, బీసీసీఐ మధ్య మార్చి 7న ఒప్పందం కుదురింది. 2017 ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే 5 ఏళ్ల ఒప్పందానికి ఒప్పో కంపెనీ బీసీసీఐకి రూ.1,079 కోట్లు చెల్లించనుంది. ఒప్పందంలో భాగంగా ఇకపై భారత క్రికెటర్లు ధరించే జెర్సీలపై ఒప్పో లోగో ఉంటుంది. అంతకుముందు స్టార్ ఇండియా భారత్ క్రికెట్ స్పాన్సరర్‌గా వ్యవహరించింది. 

Sunday, 19 February 2017

ఫిబ్రవరి 2017 స్పోర్ట్స్

భారత మహిళలకు ప్రపంచకప్ అర్హత టోర్నీ టైటిల్ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ టోర్నీ ఫైనల్లో భారత్ విజేతగా నిలిచింది. కొలంబోలో ఫిబ్రవరి 21న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొత్తం పది జట్లు పాల్గొన్నఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్‌లు జూన్‌లో ఇంగ్లండ్‌లో జరగనున్న ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. 

హెచ్‌ఐఎల్ టైటిల్ గెలుచుకున్న కళింగ లాన్సర్స్కళింగ లాన్సర్స్ జట్టు హాకీ ఇండియా లీగ్-2017 టైటిల్ గెలుచుకుంది. ఛండీగఢ్‌లో ఫిబ్రవరి 26న జరిగిన ఫైనల్లో దబాంగ్ ముంబైపై విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. 

ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో హారికకు కాంస్యంఇరాన్‌లో జరిగిన ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ (నాకౌట్ ఫార్మాట్)లో ద్రోణవల్లి హారిక కాంస్య పతకం సాధించింది. ఫిబ్రవరి 25న తాన్ జోంగి (చైనా)తో జరిగిన సెమీఫైనల్ టైబ్రేక్‌లో హారిక 3-4 తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో హారిక వరుసగా మూడోసారి కాంస్యంతో సరిపెట్టుకుంది. 2012, 2015 ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో హారిక కాంస్యం నెగ్గింది. 

జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్హైదరాబాద్లోజరిగిన జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణాకు చెందిన బబిత జాక్వెలిన్ స్వర్ణం గెలుచుకుంది. మహిళల 45 ప్లస్ విభాగంలో 5000 మీ. పరుగు పందెంలో బబిత 25 నిమిషాల 21.6 సెకండ్లలో గమ్యం చేరుకొని విజేతగా నిలిచిది. ఈ టోర్నీలో బబితకిది మూడో స్వర్ణం. 35 ప్లస్ పురుషుల డిస్కస్‌త్రోలో ఢిల్లీకి చెందిన ఆకాశ్ మాథూర్ తొలిస్థానంలో నిలవగా పర్వేశ్ తోమర్ (ఢిలీ), సుఖ్వీందర్ సింగ్ (తెలంగాణ) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ప్రపంచకప్ షూటింగ్లోజీతూ-హీనా జోడికి స్వర్ణం భారత్‌లో తొలిసారి (న్యూఢిల్లీ) జరుగుతున్నఅంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య-ISSF ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన జీతూ రాయ్-హీనా సిద్ధూ జోడి స్వర్ణం గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో జీతూ రాయ్-హీనా సిద్ధూ ద్వయం జపాన్‌కు చెందిన యుకారి కొనిషి-తొమొయుకి మత్సుదా జోడీపై గెలిచింది.

పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో అంకుర్ మిట్టల్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకోగా జేమ్స్ విలెట్ (ఆస్ట్రేలియా) 75 పాయింట్లతో (ప్రపంచ రికార్డు) స్వర్ణ పతకాన్ని గెలిచాడు. జేమ్స్ డీడ్మన్ (బ్రిటన్-56 పాయింట్లు) కాంస్య పతకాన్ని నెగ్గాడు.

భారత షూటర్ పూజా ఘాట్కర్ కాంస్యం గెలుచుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మహారాష్ట్రకు చెందిన పూజా మూడో స్థానంలో నిలిచి పతకాన్ని దక్కించుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో చైనా షూటర్ బుహాన్ సాంగ్ పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు.

2020 టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టనున్న డబుల్స్ ఈవెంట్‌ను ప్రపంచ కప్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.

అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో హుస్సాముద్దీన్‌కు రజతం 68వ స్ట్ట్రాన్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ రజత పతకం సాధించాడు. బల్గేరియాలోని సోఫియాలో ఫిబ్రవరి 27న ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో హుస్సాముద్దీన్ 56 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఉక్రెయిన్‌కు చెందిన మికోలా బుత్సెంకో స్వర్ణం గెలుపొందాడు. ఇదే టోర్నీలో భారత్‌కు చెందిన అమిత్ ఫంగల్ పురుషుల 49 కేజీల విభాగంలో, మీనా కుమారి మహిళల 54 కేజీ కేటగిరీలో కాంస్య పతకాలు సాధించారు.

బీడబ్ల్యూఎఫ్‌లో ఒలింపిక్ కమిటీ ప్రతినిధిగా సైనా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య-BWFలో ఒలింపిక్ కమిటీ ప్రతినిధిగా వ్యవహరించనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఫిబ్రవరి 26న ఓ ప్రకటన విడుదల చేసింది. 2016లో రియో ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలోని అథ్లెట్స్ కమిషన్స్ సభ్యురాలిగా సైనా నియమితులయ్యారు. 

జోవిల్‌ఫ్రెడ్‌కు ఓపెన్ 13 టెన్నిస్ టైటిల్ఓపెన్ 13 టెన్నిస్ టైటిల్‌ను ప్రాన్స్ ఆటగాడు జోవిల్ ఫ్రెడ్ సొంగా మరోసారి సొంతం చేసుకున్నాడు. ఫిబ్రవరి 27న జరిగిన ఫైనల్స్‌లో లుకాస్ పోలీపై 6-4, 6-4తో గెలుపొందాడు. 2009, 2013లో సొంగా ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. అతడి కెరీర్‌లో ఇది 14వ టైటిల్.

ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో అవార్డులు-2017 ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ espncricinfo 2017 ఉత్తమ క్రికెటర్స్ అవార్డులను ఫిబ్రవరి 27న ప్రకటించింది. 2016లో ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రేయర్స్‌ను నిర్ణయించింది. ఈ జాబితాలో చోటు సంపాదించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2016లో భారత్ ఆడిన 12 టెస్టులో తొమ్మిందింటిలో విజయం సాధించినందుకు గాను కోహ్లిని ఈ అవార్డుకు నామినేట్ చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. 
అవార్డు గ్రహీతలు 
కెప్టెన్ ఆఫ్ ది ఇయర్
- విరాట్ కోహ్లీ(భారత్)
ఉత్తమ టెస్ట్ బ్యాటింగ్
- బెన్ స్టోక్స్ - ఇంగ్లండ్ (198 బంతుల్లో 258)
ఉత్తమ టెస్ట్ బౌలింగ్
- స్టువర్ట్ బ్రాడ్ - ఇంగ్లండ్
ఉత్తమ వన్డే బ్యాటింగ్
- క్వింటన్ డికాక్ - దక్షిణాఫ్రికా (178)
ఉత్తమ వన్డే బౌలింగ్
- సునీల్ నరైన్ - వెస్టిండీస్ (6/27)
ఉత్తమ టీ20 బ్యాటింగ్
- కార్లోస్ బ్రాత్‌వైట్ - వెస్టిండీస్
ఉత్తమ టీ20 బౌలింగ్
- ఎమ్ రహ్మాన్ - బంగ్లాదేశ్ (5/22)
ఉత్తమ ఆరంగేట్ర ఆటగాడు
- మెహ్‌దీ హసన్ మిరాజ్ - బంగ్లాదేశ్

మహిళల విభాగంలో అవార్డులు
ఉత్తమ బ్యాట్స్‌విమెన్
- హేలీ విలియమ్స్-వెస్టిండీస్
ఉత్తమ బౌలర్
- లీ కాస్పెరెక్-న్యూజిలాండ్


లారెస్ ఉత్తమ క్రీడాకారులుగా బోల్ట్, బైల్స్ప్రముఖ అథ్లెట్లు ఉసేన్ బోల్ట్, సిమోన్ బైల్స్‌లు లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు-2017కు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 15న మొనాకాలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవంలో జమైకాకు చెందిన ఉసేన్ బోల్ట్ స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్, ఆస్ట్రేలియా జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి సిమోన్ బైల్స్ స్పోర్‌‌ట్స ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు. కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్‌ని వరించింది. రియో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనకుగాను వీరు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డులను ఆస్కార్ ఆఫ్ స్పోర్ట్స్‌గా పరిగణిస్తారు.
అవార్డుల జాబితా
  • స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్ : ఉసేన్ బోల్ట్
  • స్పోర్ట్స్‌ఉమెన్ ఆఫ్ ద ఇయర్ : సిమోన్ బైల్స్
  • కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్ : మైఖేల్ ఫెల్ప్స్
  • బ్రేక్‌త్రూ ఆఫ్ ద ఇయర్ : నికో రోస్‌బర్గ్
  • టీం ఆఫ్ ద ఇయర్ : చికాగో కబ్స్

అంతర్జాతీయ క్రికెట్‌కు అఫ్రిది గుడ్ బై:

పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఫిబ్రవరి 19న అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. 1996లో కెన్యాపై అరంగ్రేటం చేసిన అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 1996లో శ్రీలంకపై 37 బంతుల్లో శతకం చేసి అత్యధిక వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును తర్వాతి కాలంలో అండర్సన్, ఏబీ డివిలియర్స్ అధిగమించారు.
ఆఫ్రిది కెరీర్
మ్యాచ్‌లుసంఖ్యపరుగులుశతకాలువికెట్లు
టెస్టులు271,176548
వన్డేలు3988,0646395
టి20లు981,405-97

ఈస్ట్‌జోన్‌కు జాతీయ టీ20 క్రికెట్ టోర్నమెంట్ టైటిల్ఇంటర్ జోనల్ ఫార్మాట్‌లో తొలిసారి జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జాతీయ టీ20 క్రికెట్ టైటిల్‌ను ఈస్ట్‌జోన్ గెలుచుకుంది. ముంబైలో ఫిబ్రవరి 18న జరిగిన ఫైనల్లో వెస్ట్‌జోన్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

మహిళల వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన భారత్
భారత మహిళల క్రికెట్ జట్టు 2017లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 17న కొలంబోలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.
ఇంగ్లండ్‌లో జూన్ 24 నుంచి జూలై 23 వరకూ మహిళల వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు టోర్నీకి ముందే నేరుగా అర్హత సాధించాయి.

ఐపీఎల్ పదో సీజన్ వేలం 
ఇండియన్ ప్రీమియర్ లీగ్-IPL పదో సీజన్(IPL-2017) వేలం ఫిబ్రవరి 20న బెంగళూరులో జరిగింది. మొత్తం 357 మంది ఆటగాళ్లు వేలం జాబితాలో ఉండగా కేవలం 66 మందిని వివిధ జట్లు కొనుగోలు చేశాయి. పుణే సూపర్ జెయింట్స్ జట్టు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను రికార్డు స్థాయిలో రూ.14.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ వేలంలో ఇది రెండో అత్యధిక మొత్తం. గతంలో ఢిల్లీ యువరాజ్ సింగ్‌ను రూ.16 కోట్లకు దక్కించుకుంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఉన్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అందరికన్నా ఎక్కువ రూ.15 కోట్లు అందుకుంటున్నాడు.

పదో సీజన్ వేలం
ఆటగాడుకొనుగోలు చేసిన జట్టువిలువ
బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)పుణెరూ.14.50 కోట్లు
టైమల్ మిల్స్(ఇంగ్లండ్)బెంగళూరురూ.12 కోట్లు
రబడ (దక్షిణాఫ్రికా)ఢిల్లీరూ.5 కోట్లు
బౌల్ట్(న్యూజిలాండ్)కోల్‌కతారూ.5 కోట్లు
కమిన్‌‌స(ఆస్ట్రేలియా)ఢిల్లీరూ.4.5 కోట్లు
క్రిస్ వోక్స్(ఇంగ్లండ్)కోల్‌కతారూ.4.2 కోట్లు
రషీద్ ఖాన్(ఆఫ్గనిస్తాన్)హైదరాబాద్రూ.4 కోట్లు
సిరాజ్ (భారత్)హైదరాబాద్రూ.2.6 కోట్లు

ప్యూమాతో కోహ్లీ రూ. 110 కోట్ల ఒప్పందంభారత కెప్టెన్ విరాట్ కోహ్లీ జర్మనీకి చెందిన ప్యూమా సంస్థతో భారీ ఒప్పందం చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల కాలానికి చేసుకున్న ఈ ఒప్పందం విలువ రూ.110 కోట్లు. తద్వారా రూ. వంద కోట్లకు మించి ఒప్పందం చేసుకున్న తొలి భారత క్రీడాకారుడిగా కోహ్లీ గుర్తింపు పొందాడు. జమైకా స్ప్రింటర్స్ ఉసేన్ బోల్ట్, అసఫా పావెల్, ఫుట్‌బాల్ క్రీడాకారులు హెన్రీ, అలివర్ గిరౌడ్‌లు ఇప్పటికే ప్యూమా సంస్థకు గ్లోబల్ అంబాసిడర్లుగా ఉన్నారు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ విజేత భారత్
శ్రీలంకలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ క్యాలిఫైయింగ్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఫిబ్రవరి 21న ముగిసిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది.
ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొనగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు 2017 జూన్‌లో జరిగే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి.

కొహ్లీ డబుల్ సెంచరీల రికార్డు హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డులు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులు సాధించడం ద్వారా వరుసగా నాలుగు టెస్టు సిరీస్‌ల్లో డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్, భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మాత్రమే వరుసగా మూడు సిరీస్‌లలో డబుల్ సెంచరీలు చేశారు. అలాగే సొంతగడ్డపై ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా కోహ్లి (1,168) సొంతం చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు సెహ్వాగ్ (1,105) పేరిట ఉంది. 

ఈ మ్యాచ్‌లో 687 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్ వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో 600కుపైగా పరుగులు చేసిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది. ముంబై, చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుల్లో భారత్ 600కు పైగా స్కోరు సాధించింది. 

డబుల్ సెంచరీలు 
  • 200, వెస్టిండీస్‌పై అంటిగ్వాలో-జూలై, 2016
  • 211, న్యూజిలాండ్‌పై ఇండోర్‌లో, అక్టోబర్- 2016
  • 235, ఇంగ్లండ్‌పై ముంబైలో, డిసెంబర్- 2016
  • 204, బంగ్లాదేశ్‌పై హైదరాబాద్‌లో, ఫిబ్రవరి-2017

అంధుల టీ-20 ప్రపంచకప్ విజేత భారత్అంధుల టీ-20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ రెండోసారి గెలుచుకుంది. ఫిబ్రవరి 12న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై తొమ్మది వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ ప్రకాశ్ 99, ఆంధ్ర ఆటగాడు అజయ్ కుమార్ రెడ్డి 43 పరుగులు సాధించారు. టైటిల్‌తో పాటు భారత్‌కు రూ. 3లక్షల నగదు బహుమతి లభించగా ప్రకాశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’ పురస్కారం దక్కింది. 2012లో జరిగిన అంధుల టీ-20 మొదటి ప్రపంచ కప్‌లోనూ పాకిస్థాన్‌ను ఓడించి భారత్ చాంపియన్‌గా నిలిచింది. 

టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్సీ రికార్డు హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 9-13 వరకూ బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా టీమిండియా వరసగా ఆరో సీరీస్‌ని గెలుచుకుంది. అలాగే విరాట్ కోహ్లీ నాయకత్వంలో వరుసగా 19 టెస్టు విజయాలు నమోదు చేసిన భారత జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ వరుసగా 18 టెస్టుల్లో విజయం సాధించింది. 

కుశ్ భగత్‌కు కాండిడేట్ మాస్టర్ టైటిల్ప్రపంచ చెస్ సమాఖ్య- ఫిడేకు చెందిన ప్రతిష్టాత్మక కాండిడేట్ మాస్టర్ టైటిల్-2017ను భారత్‌కు చెందిన కుశ్ భగత్ దక్కించుకున్నాడు. గత 6 నెలల్లో అంతర్జాతీయ చెస్ సర్యూట్‌లో సాధించిన విజయాలకు గుర్తింపుగా కుశ్‌కు ఈ టైటిల్ దక్కింది. తొలుత మహారాష్ట్ర అండర్-7 రాష్ట్ర చాంపియన్‌గా నిలిచిన కుశ్ అనంతరం రష్యాలోని సోచి నగరంలో జరిగిన వరల్డ్ స్కూల్స్ అండర్-7 బ్లిట్జ్ చాంపియన్‌గా అవతరించాడు. యూఏఈలో తొలిసారిగా జరిగిన వెస్టర్న్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించాడు.

81వ జాతీయ బ్యాడ్మింటిన్ చాంపియన్‌షిప్ 81వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో సౌరభ్ వర్మ, మహిళల విభాగంలో రితూపర్ణ దాస్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఫిబ్రవరి 7న జరిగిన ఫైనల్స్‌లో సౌరభ్ లక్ష్య సేన్‌ను ఓడించిగా, తెలంగాణకు చెందిన రితూపర్ణ దాస్ రేష్మా కార్తీక్‌పై విజయం సాధించింది. పుురుషుల డబుల్స్‌లో ఏపీకి చెందిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం నందగోపాల్-సాన్యమ్ శుక్లా జంటపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలంగాణకు చెందిన కె.మనీషాతో జతకట్టిన సాత్విక్ ఫైనల్లో వెంకట్ గౌరవ్ ప్రసాద్-జూహీ దేవాంగన్ పై విజయం సాధించాడు.

జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను శరత్ కమల్, మహిళల సింగిల్స్ టైటిల్‌ను మధురిక పాట్కర్ గెలుచుకున్నారు. మనేసర్ (హరియాణా)లో ఫిబ్రవరి 5న జరిగిన ఫైనల్లో సౌమ్యజిత్ ఘోశ్‌పై శరత్ కమల్ గెలుపొందగా, మహిళల సింగిల్స్ ఫైనల్లో మధురిక పాట్కర్ ఆరుసార్లు చాంపియన్ పౌలోమి ఘాటక్‌ను ఓడించింది. తాజా టైటిల్‌తో కలిపి శరత్ ఏడుసార్లు ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను సౌమ్యజిత్ ఘోశ్, జుబిన్ కుమార్‌ల జోడి గెలుచుకుంది. వీరు ఫైనల్లో సుస్మిత్ శ్రీరామ్, అనిర్బన్ ఘోశ్‌లను ఓడించారు. మహిళల డబుల్స్ టైటిల్‌ను అనిందితా చక్రవర్తి, సుతిత్రా ముఖర్జీ గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో పౌలోమి ఘాటక్, మౌమాదాస్‌లను ఓడించారు.

ఆసియా జూనియర్ స్క్వాష్ టోర్నీ విజేత భారత్ చైనాలోని హాంకాంగ్‌లో జరిగిన ఆసియా జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఫిబ్రవరి 5న హాంగ్‌కాంగ్‌లో జరిగిన ఫైనల్లో భారత్ 2-0 తేడాతో మలేషియాను ఓడించింది. తొలుత జరిగిన మ్యాచ్‌లో భారత అగ్రశ్రేణి ప్లేయర్ వెళ్లవన్ సెంథిల్ కుమార్ 12-10, 11-0, 11-2తో ఓమ్ సాయ్ హున్‌పై విజయం సాధించాడు. అనంతరం జరిగిన మరో సింగిల్స్‌లో అభయ్ సింగ్ 10-12, 7-11, 11-5, 14-12, 11-6తో డారెన్ రాహుల్‌పై గెలుపొందాడు.

ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్సీకి కుక్ గుడ్ బైఇంగ్లండ్ క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి అలిస్టెర్ కుక్ ఫిబ్రవరి 6న తప్పుకున్నాడు. 59 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కుక్ మొత్తం 140 టెస్టులు ఆడి 11,057 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కుక్ 2013 ఐసీసీ ప్రపంచ టెస్ట్ కెప్టన్‌గానూ ఎంపికయ్యాడు. 

అన్ని ఫార్మాట్లలో డీఆర్‌ఎస్ కు ఐసీసీ ఆమోదం టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి-DRS ని ఇకపై అన్ని ఫార్మాట్లలో అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి-ICC నిర్ణయించింది. దుబాయ్‌లో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకూ రెండు రోజుల పాటు జరిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. 2017 అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి రానుంది. 

టీ-20లో మోహిత్ ఆహ్లావత్ ట్రిపుల్ సెంచరీ ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల మోహిత్ ఆహ్లావత్ టీ-20లో ట్రిపుల్ సెంచరీ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలోని లిలితా పార్క్ మైదానంలో స్థానిక టోర్నీలో భాగంగా మావి ఎలెవన్, ఫ్రెండ్స్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మావి ఎలెవన్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన మోహిత్ 72 బంతుల్లో 300 పరుగులు సాధించాడు. ఇందులో 39 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. గతంలో ఇంగ్లండ్‌లోని లాంకషైర్ సాడిల్‌వర్త్ లీగ్‌లో శ్రీలంక ఆటగాడు ధనుక పతిరణ 72 బంతుల్లో అత్యధికంగా 277 పరుగులు చేశాడు.